Boyapati Sreenu: అఘోరాగా ప్రేక్షకుల ముందుకు బాలయ్య.. వార్తలపై స్పష్టతనిచ్చిన బోయపాటి

  • ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్
  • లాక్‌డౌన్‌తో అంతరాయం
  • బోయపాటి సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం
boyapati on balayya next movie

సింహా, లెజెండ్ సినిమాల తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను, సినీనటుడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రానున్న కొత్త సినిమాలో బాలకృష్ణ అఘోరాగా కనపడనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బోయపాటి స్పష్టతనిచ్చారు. ఆ వార్తలు నిజమేనని, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు.

ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్‌కు కూడా విరామం వచ్చింది. బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని బోయపాటి వ్యాఖ్యానించారు.

కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.

More Telugu News