బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారంటూ వార్తలు.. నమ్మొద్దంటున్న కుమారుడు
Add ap7am to your home Screen

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారంటూ వార్తలు.. నమ్మొద్దంటున్న కుమారుడు

Naseeruddin Shah hospitalisation hoax
  • నసీరుద్దీన్ షాకు అనారోగ్యమంటూ వార్తలు 
  • ఉలిక్కిపడిన బాలీవుడ్
  • అలాంటిదేమీ లేదంటూ వివాన్ షా ట్వీట్
వరుసగా రెండు రోజుల్లో బాలీవుడ్ ఇద్దరు గొప్ప నటులను కోల్పోయింది. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో వార్త చక్కర్లు కొడుతోంది. మరో దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యం బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నదే ఆ వార్త సారాంశం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో బాలీవుడ్ మరోమారు ఉలిక్కిపడింది. దీంతో నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, తన తండ్రి బాగానే ఉన్నారని, వాటిని నమ్మొదంటూ అభిమానులను కోరారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అన్న వివాన్ షా.. తన తండ్రి చేతులు జోడించి ఇర్ఫాన్ భాయ్, చింటూజీల కోసం ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. వారిని బాగా మిస్సవుతున్నామని, వారు లేని లోటు పూడ్చలేనిదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
Naseeruddin
Bollywood
Vivaan Shah

More Telugu News