భార్యతో కలసి 'బుట్టబొమ్మ' పాటకు స్టెప్పులేసిన డేవిడ్ వార్నర్!
- వైరల్ అవుతోన్న వీడియో
- సన్‌రైజర్స్ జెర్సీలో స్టెప్పులు
- భార్యతో కలిసి టిక్‌టాక్‌లు చేస్తోన్న క్రికెటర్
బుట్టబొమ్మ పాటకు ఆయన చేసిన టిక్‌టాక్ వీడియో అల్లు అర్జున్ అభిమానులను అలరిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలోనే వార్నర్ ఈ డ్యాన్స్ చేయడం గమనార్హం. కాగా, కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నాడు.