Balakrishna: బాలకృష్ణతోనూ అనిల్ రావిపూడి మూవీ

  • బోయపాటితో బాలకృష్ణ తాజా చిత్రం
  • తదుపరి సినిమా బి.గోపాల్ తో
  • లైన్లో అనిల్ రావిపూడి  
Anil Ravipudi Movie

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్లడం బాలకృష్ణకి అలవాటు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఆయన బోయపాటితో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నారు. ఆ తరువాత సినిమాను బి.గోపాల్ తో చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అనిల్ రావిపూడి కథను కూడా విన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇటీవల బాలకృష్ణను కలిసి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. బాలకృష్ణకి కథ నచ్చిందని అంటున్నారు. అయితే బోయపాటి, బి. గోపాల్ సినిమాల తరువాత బాలకృష్ణ; 'ఎఫ్ 3' .. మహేశ్ బాబు మూవీ పూర్తయ్యాక అనిల్ రావిపూడి ఫ్రీ అవుతారు. అప్పుడు ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News