చిరంజీవిగారితో ఉన్నంతసేపు గాల్లో తేలిపోయిన అనుభూతి కలిగింది: నటుడు అజయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవిగారితో ఉన్నంతసేపు గాల్లో తేలిపోయిన అనుభూతి కలిగింది: నటుడు అజయ్

 Ajaya tells about Chiranjivis receiving
  • 'విక్రమార్కుడు'తో మంచి గుర్తింపు
  • హీరోగాను కొన్ని ప్రయత్నాలు
  • 'ఆచార్య'లో కీలకమైన పాత్ర
అజయ్ పేరు వినగానే సినీ అభిమానులకు 'విక్రమార్కుడు' సినిమాలో విలన్ గా ఆయన పోషించిన పాత్ర గుర్తుకొస్తుంది. ఆ తరువాత ఆయన అటు నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలతో పాటు, ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. అవకాశాన్ని బట్టి కథానాయకుడిగాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా కెరియర్ కి ఈ పాత్ర చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా సెట్లో చిరంజీవిగారిని కలుసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఇన్నేళ్ల నా కెరియర్లో అంతకుముందు ఆయనను ఒకసారి మాత్రమే చూశాను. నన్ను ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సినిమాల గురించి ఆయన మాట్లాడుతుంటే, గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది" అన్నారు.
Chiranjeevi
Ajay
Acharya Movie
Koratala Siva

More Telugu News