Kaira Adwani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kaira Adwani opposite Prabhas
షార్ట్స్‌లో చూడండి
 *  'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తోంది. ఇందులో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ నటి కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.
*  కొంత కాలం గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. అయితే, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ కొంత మిగిలిపోయింది. షూటింగ్ మళ్లీ మొదలయ్యే లోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన షూటింగు భాగాన్ని ఎడిట్ చేస్తున్నారట. త్వరలో పవన్ డబ్బింగ్ కూడా చెబుతారని తెలుస్తోంది.
*  ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ గా వుంది. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే దీనిని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోపక్క, ఇప్పటి వరకు పూర్తయిన షూటింగుకు సంబంధించిన ఎడిటింగ్ పనులను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు.
Go Back to Shorts
Kaira Adwani
Prabhas
Pawan Kalyan
Vakil Sabh

More Telugu News