Nara Lokesh: ఆ రోజు ఇదో పెద్ద స్కాం అన్నారు.. ఈ రోజు దానికే అనుమతిచ్చారు.. వారిని ఏమనాలి ?: జగన్‌పై లోకేశ్‌ ఫైర్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దేశంలోనే కలగా మిగిలిపోయిన నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపించారు చంద్రబాబు. పట్టిసీమ ద్వారా గోదావరి - కృష్ణా నదులను కలిపారు. అదే స్ఫూర్తితో, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి, సాగర్ ఆయకట్టుకి నీరు ఇవ్వాలని, తలిచి పనులు ప్రారంభించారు.
 
ఆ రోజు, ఇదో పెద్ద స్కాం అని, అంతా మాయ అని, నీళ్లు రావు అంటూ, ఎగతాళి చేసింది వైసీపీ. అయితే, ఈ రోజు అదే ప్రాజెక్ట్, ఏదైతే మాయ అన్నారో, స్కాం అన్నారో, తన తండ్రి పేరుతో పేరు మార్చి, వైఎస్ఆర్ పల్నాడు కరవు నివారణ పధకంగా పేరు మార్చి, అదే రూ.6020 కోట్లతో, అనుమతులు ఇచ్చారు.
 
ఇలాంటి వారిని ఏమనాలి ? ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పి, ఈ రోజు అదే ప్రాజెక్ట్, అదే డబ్బులతో అనుమతులు ఇచ్చి, జగన్‌ గారు తన తండ్రి పేరు పెట్టుకుని, ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇది నేటి రాజకీయం' అని విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Jagan

More Telugu News