పాకిస్థాన్ ఐఎస్ఐకి అత్యంత సన్నిహితుడైన ఐసిస్ కమాండర్ అరెస్ట్!
- మునీబ్ మహమ్మద్ ను అరెస్ట్ చేసిన ఆఫ్ఘన్ భద్రతా దళాలు
- ఐఎస్ఐతో పాటు పలు ఉగ్ర సంస్థలతో సన్నిహిత సంబంధాలు
- ఐసిస్ లో చేరక ముందు లష్కరే తాయిబాలో కీలక పాత్ర
మునీబ్ అత్యంత కీలకమైన ఉగ్రవాది అని... ఇతనికి పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో పాటు ఉగ్ర సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, లష్కరే తాయిబా, జమాత్ ఉల్ ఉలేమా, సిపా ఈ సహబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ సంస్థల మధ్య మునీబ్ ఒక వారధిలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. ఐఎస్ఐ, ఉగ్ర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. ఐసిస్ లో చేరక ముందు మునీబ్ లష్కరే తాయిబాలో కీలకంగా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.