Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున కొత్త ప్రాజెక్టుల సందడి

  • బోయపాటితో సెట్స్ పైకి వెళ్లనున్న బాలకృష్ణ
  • తదుపరి ప్రాజెక్టు బి.గోపాల్ తో
  • బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్న పూరి
B Gopal Movie

తన కెరియర్లో తిరుగులేని రెండు విజయాలను అందించిన బోయపాటితో మూడో సినిమాను చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆయన పూర్తి వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆ తరువాత ఆయన బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.

ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సాయిమాధవ్ బుర్రా రెడీ చేశాడు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున సింపుల్ గా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళతారని అంటున్నారు. అదే రోజున పూరి జగన్నాథ్ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా రావొచ్చని చెబుతున్నారు. మొత్తానికి బాలకృష్ణ వరుస సినిమాలతో తన జోరు చూపిస్తూనే వున్నారు.

More Telugu News