చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- నేడు చంద్రబాబు పుట్టినరోజు
- 71వ పడిలో అడుగుపెట్టిన టీడీపీ అధినేత
- సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ పవన్ ట్వీట్
"గౌరనీయులైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషకరమైన సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఉదయం సీఎం జగన్ కూడా చంద్రబాబుకు విషెస్ తెలపగా, చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.