Chiranjeevi: 'లూసిఫర్' రీమేక్ లో చిరంజీవితో పాటు అల్లు అర్జున్

  • మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫర్'
  • చరణ్ చేతిలో తెలుగు రీమేక్ హక్కులు
  •  పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో బన్నీ
Lusifer Movie Remake

మలయాళంలో క్రితం ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లూసిఫర్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మోహన్ లాల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను చరణ్ దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ చేయనున్నాడనేది తాజా సమాచారం. 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్ కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

More Telugu News