'కిక్' టైపులో సాగే పాత్రలో రవితేజ
- రవితేజ చేతిలో మూడు సినిమాలు
- తాజా చిత్రంగా రానున్న 'క్రాక్'
- లైన్లో రమేశ్ వర్మ .. నక్కిన త్రినాథరావు
లాక్ డౌన్ తరువాత రమేశ్ వర్మ సినిమాను కూడా ఆయన మొదలుపెట్టనున్నాడు. ఇక నక్కిన త్రినాథరావు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర 'కిక్' సినిమాలో ఆయన రోల్ ను గుర్తు చేస్తుందని సమాచారం. కథా కథనాలు పూర్తిగా భిన్నమైనవి. అయితే కామెడీతో కూడిన ఎనర్జీ .. ఎంటర్టైన్మెంట్ .. నాటకీయత విషయంలో మాత్రం 'కిక్' ను గుర్తుకు తెస్తుందని అంటున్నారు. యూత్ .. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో అలరించేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.