Balakrishna: దసరా కానుకగా రానున్న బాలయ్య సినిమా

  • బోయపాటితో రెండు హిట్లు కొట్టిన బాలయ్య
  • లాక్ డౌన్ కారణంగా మారిన ప్లాన్
  • ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయం  
Boyapati Movie

బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో, తాజా ప్రాజెక్టుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టి, జూలై 30వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఈలోగా కరోనా వైరస్ .. లాక్ డౌన్ కారణంగా ముందుగా వేసుకున్న ప్రణాళికలో మార్పులు చేసుకోవలసి వచ్చింది.

లాక్ డౌన్ పూర్తికాగానే ఈ సినిమా షూటింగును మొదలుపెడతారట. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేసి, దసరా కానుకగా అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమా ద్వారా బోయపాటి కొత్త కథానాయికను పరిచయం చేస్తున్నాడు. ఈ సారి దసరాకి బాక్సాఫీస్ దగ్గర భారీ సందడే వుండనుందన్న మాట.

More Telugu News