లాక్ డౌన్ ను ఉల్లంఘించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేపై కేసు!
- అంబేద్కర్ జయంతిని నిర్వహించిన ఎమ్మెల్యే
- అనుచరులతో కలిసి బారికేడ్ల తొలగింపు
- ఐపీసీ 188 కింద కేసు పెట్టిన పోలీసులు
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, ఈ తరహా చర్యలు ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయని, దీంతోనే ఆయనపై కేసు నమోదు చేశామని గడేనగర్ పోలీసు ఇనస్పెక్టర్ మనీశ్ థాకరే వెల్లడించారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపైనా ఐపీసీలోని సెక్షన్ 188, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు.
ఇదిలావుంచితే, గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన కథానాయిక నవనీత్ కౌర్ భర్తే రవీ రాణా. నవనీత్ ఇప్పుడు మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలిగా వున్నారు.