Balakrishna: బాలయ్య సరసన కొత్త హీరోయిన్: బోయపాటి

  • బాలకృష్ణతో బోయపాటి మూడో సినిమా
  • రెండు డిఫరెంట్ లుక్స్ తో బాలయ్య
  • శ్రియ, అంజలిల ఎంపికపై క్లారిటీ ఇవ్వని బోయపాటి
Boyapati Movie

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితమవుతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా శ్రియ - అంజలి నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ బాలకృష్ణ జోడీగా ఒక కొత్త హీరోయిన్ కనిపించనుందంటూ తాజాగా బోయపాటి చెప్పారు.

బాలకృష్ణ సరసన ఇద్దరు కొత్త హీరోయిన్లను అనుకుంటున్నామనీ, అందులో ఒకరి పేరును సరైన సమయం చూసి ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమా కోసం హీరోయిన్స్ దొరక్క తాము చాలా ఇబ్బందులు పడినట్టుగా వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఇక ఈ సినిమా కోసం ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పారేగానీ, శ్రియ - అంజలి ఉన్నారా? లేరా? అనే విషయంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

More Telugu News