Balakrishna: బోయపాటి సినిమాలో రావు రమేశ్

  • బోయపాటితో బాలయ్య మూవీ
  • త్వరలో పట్టాల పైకి
  • కథానాయికలుగా శ్రియ - అంజలి
Boyapati Movie

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో సినిమా అనగానే యాక్షన్ కి .. ఎమోషన్ కి కొదవుండదనే విషయం అభిమానులకు అర్థమైపోతుంది. 'సింహా' .. 'లెజెండ్' వంటి చిత్రాలు ఈ ఇద్దరి కాంబినేషన్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరూ మరోసారి సెట్స్ పైకి వెళుతున్నారు.

ఈ సినిమాలో కథానాయికలుగా శ్రియ - అంజలిని ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్ర ఒకటి ఉందట. ఈ పాత్ర గురించి వింటున్నప్పుడే, ఆ పాత్రను రావు రమేశ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బాలకృష్ణ వ్యక్తం చేశారట. బాలకృష్ణ సూచించిన మేరకు రావు రమేశ్ ను సంప్రదించి, ఆ పాత్రకు ఆయనను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఆయన పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా 'సింహా' .. 'లెజెండ్' పాత్రలను మించిన విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.

More Telugu News