బోయపాటి సినిమాలో లేడీ విలన్ గా భూమిక... బాలయ్యతో పోరుకు రెడీ!
- బాలయ్యతో మూడో సినిమా ప్లాన్ చేసిన బోయపాటి
- పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రకు భూమిక పేరు పరిశీలన
- భూమిక అంగీకరిస్తే అధికారిక ప్రకటన
ఇక, తాను బాలయ్యతో తీయబోయే సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర ఉండగా, ఆ పాత్రకు నటి భూమికను తీసుకోవాలని బోయపాటి భావించారని, ఈ మేరకు ఆయన టీమ్, ఇప్పటికే ఆమెను సంప్రదించిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భూమిక ఈ పాత్రకు అంగీకరిస్తే, వెంటనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ లేకుండా ఉంటే, వారణాసిలో సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ పాటికే పూర్తయి ఉండేది. కాగా, బాలయ్య నటించిన 'రూలర్' చిత్రంలో భూమిక ఓ ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.