Allu Arjun: బన్నీ సినిమాకి రెండు అక్షరాల టైటిల్

  • సుకుమార్ తో బన్నీ మూవీ 
  • గతంలో వచ్చిన 'ఆర్య' .. 'ఆర్య 2'
  • ఈ నెల 8న ఫస్టులుక్ రిలీజ్   
Sukumar Movie

అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. లాక్ డౌన్ ఎత్తివేయగానే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? అనే విషయంలో అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

గతంలో సుకుమార్ - బన్నీ కాంబినేషన్లో 'ఆర్య' .. 'ఆర్య 2' సినిమాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ ప్రకారమే తాజా చిత్రానికి కూడా రెండు అక్షరాల టైటిల్ నే సెట్ చేసే ఉద్దేశంతో సుకుమార్ వున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారు. ఆ రోజున టైటిల్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  

More Telugu News