కరోనా వివరాల కోసం వెళితే దాడికి యత్నించిన కుటుంబం.. భయంతో పరుగులు తీసిన ఆశా కార్యకర్త
- ఆదిలాబాద్‌లో ఘటన
- ఆందోళనకు దిగిన ఆశా కార్యకర్తలు
- పట్టించుకోకుండా వెళ్లిపోయిన డీఎంహెచ్‌వో
ఈ రోజు ఆదిలాబాద్ చోటా తలాబ్‌లో ఆశా కార్యకర్తపై దాడికి యత్నం జరగడం కలకలం రేపింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆశా కార్యకర్త వివరాలు సేకరిస్తున్నారు. కరోనా వివరాలను సేకరించడానికి చోటా తలాబ్ వెళ్లిన ఆశా కార్యకర్తపై ఓ కుటుంబం దాడి చేయబోయింది.
ఆశా కార్యకర్త వద్ద పత్రాలను చించేసి భయాందోళనలకు గురిచేసింది. కుటుంబ సభ్యుల దాడి నుంచి తప్పించుకున్న ఆశా కార్యకర్త భయంతో పరుగులు తీసింది. దీంతో తమకు భద్రత కల్పించాలని డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు. అయితే, వారి ఆందోళనను పట్టించుకోకుండా డీఎంహెచ్‌వో చందు అక్కడి నుంచి వెళ్లిపోయారు.