ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ.. ఆ పోస్టులేమిటి?: సినీనటులపై మండిపడ్డ దర్శకురాలు
Add ap7am to your home Screen

ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ.. ఆ పోస్టులేమిటి?: సినీనటులపై మండిపడ్డ దర్శకురాలు

farah khan fires on celebrities
  • ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంతా క‌రోనాతో భ‌య‌ప‌డుతున్నారన్న ఫరాఖాన్
  • సెలబ్రిటీలకు అన్ని స‌దుపాయాలు ఉన్నాయని వ్యాఖ్య
  • వారు ఇంటి వద్ద వ‌ర్కౌట్స్ చేస్తున్నారన్న దర్శకురాలు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సినీనటులు మాత్రం ఇంట్లో ఎంజాయ్‌ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తుండడంపై బాలీవుడ్ దర్శకురాలు ఫ‌రా ఖాన్ (55) మండిపడ్డారు. తమ ఇంటి పరిసరాల్లో విశాల ప్రదేశాల్లో వ్యాయామాలు చేస్తూ హీరోయిన్‌లు చేస్తోన్న పోస్టులపై ఆమె స్పందించింది.

ప్ర‌స్తుతం  ప్ర‌జ‌లంతా క‌రోనాతో భ‌య‌ప‌డుతున్నారని, సెలబ్రిటీలకు అన్ని స‌దుపాయాలు ఉన్నాయి కాబట్టి వ‌ర్కౌట్స్ చేస్తున్నారని  తెలిపింది. లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కూడా సెలబ్రిటీలు అందం గురించి ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ తీసుకుంటున్నారని చెప్పింది. చేత‌నైతే పేద‌వారిని ఆదుకోవాలని, అంతేకాని అవ‌స‌రం లేని పోస్టులు చేయొద్దని ఆమె ముక్కుసూటిగా మాట్లాడుతూ ఓ వీడియో పోస్టు చేసింది.
Bollywood
Viral Videos
Corona Virus

More Telugu News