Kangana Ranaut: ఎన్టీఆర్ పాత్ర చేయడానికి నో చెప్పిన బాలయ్య

  • జయలలిత బయోపిక్ గా 'తలైవి'
  • ప్రధాన పాత్రధారిగా కంగనా రనౌత్ 
  • ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - అరవింద్ స్వామి
Thalaivi Movie

దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' పేరుతో రూపొందుతోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ప్రధానమైన పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. అరవింద్ స్వామి .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

జయలలిత - ఎన్టీ రామారావు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. అందువలన ఈ సినిమాలో ఎన్టీ రామారావు పాత్ర కూడా వుంది. ఆ పాత్రను బాలకృష్ణతో చేయిస్తే బాగుంటుందని నిర్మాత విష్ణు ఇందూరి భావించాడు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో ఆయన ఒకరు. ఆ సాన్నిహిత్యంతోనే ఆయన బాలయ్యను సంప్రదించాడట. అయితే బాలకృష్ణ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఆ పాత్రను వేరేవారితోనైనా చేయిస్తారా? లేదంటే తొలగిస్తారా? అనేది చూడాలి.

More Telugu News