కరోనా సోకలేదు.. కాలు విరిగిందనే ఆసుపత్రికి: ట్వింకిల్ ఖన్నా
- స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త అక్షయ్
- వీడియోను పోస్ట్ చేసిన ట్వింకిల్
- కాలు విరగడంతో కట్టు కట్టించుకున్నట్టు వెల్లడి
ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్పిటల్ అనగానే అందరూ ఆందోళన చెందడం సహజమని అభిప్రాయపడింది. అయితే, తనకు కరోనా వైరస్ లేదన్న ట్వింకిల్.. విరిగిన కాలుకు కట్టు కట్టించుకోవడం కోసం ఆసుపత్రికి వెళ్లినట్టు ఆ వీడియోలో చెప్పింది. ‘ఆసుపత్రి నుంచి మా ఇంటికి వెళ్తుండగా రోడ్లు ఎడారులను తలపిస్తున్నాయి. ఆసుపత్రి అనగానే ఎవరూ కంగారు పడొద్దు. నేను బకెట్ తన్నేస్తానని అనుకుంటున్నారేమో. నేనిప్పుడు ఏ బకెట్ తన్నలేను’ అని సరదాగా ట్వీట్ చేసింది.