భోపాల్ లో జర్నలిస్టుకు సోకిన కరోనా!
- ఈ నెల 17న లండన్ నుంచి వచ్చిన పాత్రికేయుడి కుమార్తె
- అతడితోపాటు మీడియా సమావేశానికి హాజరైన వారికి హోం క్వారంటైన్ ఆదేశాలు
- జర్నలిస్టు కుమారుడు, భార్యకు కరోనా నెగటివ్
మార్చి 17న ఆయన కుమార్తె లండన్ నుంచి వచ్చిందని, ఆమెతో ఉండడం వల్లే వైరస్ సోకి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 519 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క భోపాల్‌లోనే 15 కరోనా కేసులు నమోదయ్యాయి.