ap7am logo

సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న కత్రినా కైఫ్ ఆసక్తికర వీడియో

Tue, Mar 24, 2020, 07:33 PM
Katrina Kaif postes an interesting Video
  • బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్
  • ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేసిన కత్రినా
  • తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో గిన్నెలు కడుగుతూ కనబడ్డ బ్యూటీ
ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. దీని బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అందులో ఒకటి ‘సెల్ఫ్ క్వారంటైన్’. ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం లేదా ఇంటి పనుల్లో సాయం చేయడం వంటివి చేస్తూ గడిపేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. ఇప్పటికే ఇంట్లో తాను ఏ విధంగా గడుపుతుందో తెలియజేస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన కత్రినా, తాజాగా మరో వీడియో పోస్ట్ చేసింది. తమ ఇంట్లో సింక్ వద్ద గిన్నెలు కడుగుతూ ఉండటం ఆ వీడియోలో కనపడుతుంది.


X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad