సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Alia Bhat not out of Rajamouli film RRR
  • అలియా భట్ తప్పుకోలేదట!
  • నాగార్జున సినిమాకి కరోనా ఆటంకం 
  • 'ఉప్పెన' విడుదల వాయిదా
 *  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి కథానాయిక అలియా భట్ తప్పుకున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదనీ, డేట్స్ సమస్య వచ్చినప్పటికీ సర్దుబాటు చేసిందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం కోసం జూన్ లో ఆమె డేట్స్ ఇచ్చిందట.  
*  నాగార్జున తన తదుపరి చిత్రంగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కావలసి వుంది. అయితే, కరోనా నేపథ్యంలో అందరూ షూటింగులు వాయిదా వేసుకుంటూ ఉండడంతో ఇది కూడా వాయిదా పడుతుందని అంటున్నారు.  
*  మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రం విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతున్న కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో వాయిదా వేసుకున్నట్టు సమాచారం. దీనికి సుకుమార్ వద్ద పనిచేసిన సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Rajamouli
Alia Bhat
Nagarjuna
Sai tej
Vaishnav tej

More Telugu News