Deepika Padukone: అతను నన్ను మోసం చేశాడు.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా: రణ్‌బీర్‌ గురించి హీరోయిన్ దీపిక

Deepika Padukone on her Failed Relationship
షార్ట్స్‌లో చూడండి
తన మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌ గురించి బాలీవుడ్ హీరోయిన్‌ దీపిక పదుకుణె పలు విషయాలు బయటపెట్టింది. ఆయన పేరు ప్రస్తావించకుండా పలు సంచలన విషయాలను చెప్పింది. తన దృష్టిలో సెక్స్‌ అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదని, ఎన్నో భావోద్వేగాలు కలిసుంటాయని చెప్పింది.

తాను గతంలో ఓ హీరోతో ప్రేమలో ఉన్నప్పుడు ఆయనను మోసం చేయలేదని, ఆ వ్యక్తిని కాదని మరో పక్కకు వెళ్లలేదని తెలిపింది. అతడు మోసం చేస్తాడని కొందరు తనకు చెప్పారని చెప్పింది. అతడు తనను ఓ సారి మోసం చేసినప్పటికీ, అతడు వేడుకోవడంతో రెండో అవకాశం ఇచ్చి ప్రేమను కంటిన్యూ చేశానని చెప్పింది.

అదే తాను చేసిన తప్పని, అతడు తన మోసాన్ని కొనసాగించాడని, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని దీపిక తెలిపింది. ఇందులోంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని చెప్పింది. ఆ వ్యక్తి మోసం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని తెలిసిందని తెలిపింది. కాగా, రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయిన కొన్ని సంవత్సరాల తరువాత ఆమె రణ్‌వీర్‌ సింగ్‌ను 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Deepika Padukone
Bollywood

More Telugu News