Nagababu: వైసీపీ వారి గూండా గిరికి నిలబడ్డ పెద్దాయన వీడియో ఇది!: నాగబాబు

  • ‘టిక్ టాక్’లో వచ్చిన ఓ వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు
  • దాడికి యత్నిస్తున్న ఓ వ్యక్తిపై ఎదురుతిరిగిన వృద్ధుడు  
  • ‘అదీ పౌరుషం అంటే..‘ అంటూ కితాబిచ్చిన నాగబాబు
Naga Babu posts a video of old man who fights against politician

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా, జనసేన పార్టీ నేత, ప్రముఖ నటుడు నాగబాబు స్పందించారు. ‘టిక్ టాక్’ లో వచ్చిన ఓ వీడియోను పోస్ట్ చేసిన నాగబాబు, ‘అదీ పౌరుషం అంటే.. వైసీపీ వారి గూండా గిరికి నిలబడ్డ పెద్దాయన..‘ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైట్ అండ్ వైట్ దుస్తులు ధరించిన ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి గోడ వద్ద ఉన్న ఒక కట్టెను తీసుకుని మరో వ్యక్తిపై దాడికి యత్నిస్తుండటం, అక్కడే ఓ వృద్ధుడు తొడకొడుతూ ముందుకెళ్లడం ఇందులో కనబడుతుంది.

More Telugu News