Prabhas: ఉగాదికి ప్రభాస్ ఫస్టులుక్

  • రాధాకృష్ణ దర్శకుడిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  •  ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే 
  • తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల
RadhaKrishna Movie first look for Ugadi

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. భారీస్థాయిలో హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.

ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ తో పాటు, 'ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏ టైటిల్ అనేది ఇంకా ఖరారు చేయలేదు. కొన్ని రోజుల్లో టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. సో.. ఈ ఉగాది ప్రభాస్ అభిమానులకు మంచి గిఫ్ట్ నే ఇవ్వనుందన్న మాట. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.

More Telugu News