ప్రణయ్ హత్య కేసు విచారణ వాయిదా.. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు

ప్రణయ్ హత్య కేసు విచారణ వాయిదా.. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టుకు తెలిపిన పోలీసులు

Pranay murder case hearing adjourned to 23rd of this month
  • నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ
  • కోర్టుకు హాజరుకాని అమృత బాబాయ్ శ్రవణ్
  • తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ప్రణయ్ పరువు హత్య కేసు విచారణ వాయిదా పడింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ రోజు ఈ కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా నిందితులు సుభాష్ శర్మ, అస్గర్ అలీలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు అమృత బాబాయ్ శ్రవణ్ కోర్టుకు హాజరుకాలేదు. కేసులో ఏ1 నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కేసు విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు.
Pranay Murder Case
SC ST Court
Nalgonda District
Maruti Rao
Amrutha

More Telugu News