కాంగ్రెస్‌కు షాకిచ్చిన సింధియా.. సంక్షోభంలో మధ్యప్రదేశ్ సర్కారు
- 17 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోయిన సింధియా
- సింధియా మద్దతుదారులతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ
- బీజేపీ నుంచి రాజ్యసభకు సింధియా?
సింధియా బీజేపీలో చేరి రాజ్యసభ సభ్వత్వం తీసుకుంటారని, అనంతరం మంత్రి పదవి కూడా చేపడతారన్న వార్తలు నిన్నంతా షికారు చేశాయి. మరోవైపు, సింధియాకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంకోవైపు, ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం కమల్‌నాథ్ చర్యలు ప్రారంభించారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి బుజ్జగించాలన్న ఉద్దేశంతో 20 మంది మంత్రులతో రాజీనామా చేయించారు.