బేర్ గ్రిల్స్ తో రజనీకాంత్ సాహసాలు... ట్రైలర్ ఇదిగో!
- రజనీతో ఇంటూ ద వైల్డ్ స్పెషల్ ఎపిసోడ్ రూపొందించిన బేర్ గ్రిల్స్
- మార్చి 23న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం
- తాజాగా ట్రైలర్ విడుదల
'ఇంటూ ద వైల్డ్... రజనీ విత్ బేర్ గ్రిల్స్' ఎపిసోడ్ డిస్కవరీ ఇండియా చానల్లో ఈ నెల 23న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఇందులో రజనీ తన స్టయిల్ ను మిస్ కాకుండా చూసుకోవడమే కాదు, బేర్ గ్రిల్స్ విస్మయపడేలా సినిమాకు తీసిపోని అడ్వెంచర్లు చేశాడు. చివర్లో కళ్లద్దాలను ఎంతో చాతుర్యంతో తిప్పుతూ ధరించడం హైలైట్.