RGV: అమెజాన్ అలెక్సాకు సారీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

RGV says sorry to Amazon Alexa
షార్ట్స్‌లో చూడండి
సంచలనాలు, వివాదాలు, వినోదం కలబోతగా కనిపించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాయిస్ అసిస్టెంట్ యాప్ అలెక్సాకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవం మార్చి 8న అయితే, తాను కాస్త ఆలస్యంగా 9వ తేదీన విషెస్ తెలియజేస్తున్నందుకు అలెక్సాకు సారీ కూడా చెప్పారు. "వాస్తవానికి నువ్వు సిరి కంటే చాలా ఉత్తమం, అయితే ఈ విషయం సిరికి చెప్పొద్దు సుమా!" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు.

అంతకుముందు, ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ యాప్ సిరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. "నాకు తెలిసినంతవరకు ఎలాంటి గొడవ చెయ్యని ఏకైక మహిళవు నువ్వే సిరి" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. అలెక్సా, సిరి యాప్ లు మహిళల గొంతుకతో వినియోగదారులకు సేవలు అందిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ రెండింటిని మహిళలతో పోల్చి వర్మ విషెస్ తెలిపారు.
Go Back to Shorts
RGV
Alexa
Amazon
Siri
Apple
Womens day

More Telugu News