Viral Videos: 2017లో విజయ్ దేవరకొండపై తెలంగాణ ప్రభుత్వం చిత్రీకరించిన హోలీ సాంగ్... ఇప్పుడు వైరల్!

  • దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి
  • సందర్భం రావడంతో మళ్లీ వైరల్
  • మత సామరస్యాన్ని చాటేలా వీడియో సాంగ్
Holi Song on Vijay Devarakonda Viral Again

అది 2017. ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సభల కోసం కొన్ని పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించింది. వీటిల్లో ఓ పాటను వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, విజయ్ దేవరకొండ నటించాడు. హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ సాగే పాట, ఈ హోలీ సందర్భంగా మరోసారి వైరల్ అయింది. ఈ దాదాపు రెండున్నరేళ్ల క్రితం చిత్రీకరించినదే అయినా, సందర్భం రావడంతో, అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ మరోసారి చూడవచ్చు.

More Telugu News