రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఏపీ టీడీపీ నేతలు
- వ్యవస్థలను సీఎం నీరుగారుస్తున్నారని ఆరోపణ
- ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
గ్రామాల్లో ప్రతిదానికీ వైసీపీ రంగులు వేశారని, పంచాయతీ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు ఆ పార్టీ జెండా రంగులు వేశారని, తద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, 90 శాతం వలంటీర్లు వైసీపీ వాళ్లేనంటూ గతంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఎదుట ప్రస్తావించారు. కళా వెంకట్రావుతో పాటు ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణరాజు, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.