Pawan Kalyan: పవన్​ కల్యాణ్​ కొత్త చిత్రం టైటిల్​ ‘వకీల్​ సాబ్​’.. ఫస్ట్​ లుక్ విడుదల

  • పవన్ కల్యాణ్ 26వ చిత్రం ‘వకీల్ సాబ్’
  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్
  • ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చున్న పవన్
Pawan kalyan new movie title Vakilu saabu first look releases

ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్ విడుదలైంది. ఈ  చిత్రం టైటిల్ ను ‘వకీల్ సాబ్’గా నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. లగేజ్ ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో కుర్చీపై కాళ్లు ఆనించి ఉండటం ఫస్ట్ లుక్ లో కనబడుతుంది. కాగా, పవన్ కల్యాణ్ నటిస్తున్న 26వ చిత్రమిది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.

More Telugu News