chennai: పోలీసుల దుస్తుల్లో టిక్‌ టాక్‌ చేసిన నర్సు.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించిన పోలీసులు

tiktok video on police dress
షార్ట్స్‌లో చూడండి
టిక్‌టాక్‌ వీడియోల ద్వారా ఫేమస్‌ అయిపోవాలని యువతీయువకులు ఎన్నో వేషాలు వేస్తుంటారు. ఎలగోలా బాగా లైకులు, కామెంట్లు, షేర్లు సంపాదించి పేరు తెచ్చుకోవాలని భావిస్తుంటారు. ఈ పిచ్చే వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా పోలీసుల దుస్తుల్లో టిక్‌ టాక్‌ చేసిన నర్సు, సహాయ నటి శ్రీనిక అనే అమ్మాయికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల ఆమె పోలీసుల దుస్తుల్లో వీడియోలు తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన చెన్నై పోలీసులు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి వార్నింగ్‌ ఇచ్చి పంపారు.  మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పారు. టిక్‌టాక్‌ వీడియో పోస్ట్‌ చేసిన ఐపీ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆమెను పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
chennai
Tamilnadu
tiktok

More Telugu News