పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై మునిసిపల్ కార్పొరేటర్ ఫిర్యాదు.. పరారీలో నేత!
- 1999 నుంచి వేధిస్తున్నాడని ఫిర్యాదు
- నరేంద్ర మెహతా నుంచి హాని ఉందన్న బాధిత కార్పొరేటర్
- పరారీలో ఉన్న మెహతా కోసం పోలీసుల గాలింపు
కార్పొరేటర్, నరేంద్ర మెహతాలు అభ్యంతరకరంగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెహతా తనను 1999 నుంచి లైంగికంగా వేధిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులకు అతడి నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత కార్పొరేటర్ పేర్కొన్నారు. మెహతా, తార్కర్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.