చంద్రబాబును అరెస్ట్ చేయలేదు: హోంమంత్రి సుచరిత వివరణ
- ప్రజలే చంద్రబాబును అడ్డుకున్నారు
- రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు విశాఖకు వచ్చారు
- చంద్రబాబు మెచ్చుకున్న పోలీసులే ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నారు
చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు అనుమతి ఉందని... కానీ, విశాఖలో ఆయన అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదని సుచరిత చెప్పారు. ఈ కారణం వల్లే విశాఖకు వెళ్లవద్దని ఆయనకు సూచించామని తెలిపారు. మూడు రాజధానులపై తన స్టాండ్ ను స్పష్టం చేసిన చంద్రబాబు... విశాఖకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.