Kashvee Gautam: అమ్మాయిల క్రికెట్ లో అద్భుతం... ప్రత్యర్థి జట్టులో అందర్నీ అవుట్ చేసిన కశ్వీ

Kashvi Gutam set record with 10 wickets
అప్పుడెప్పుడో జిమ్ లేకర్ సాధించిన 10 వికెట్ల రికార్డును అనిల్ కుంబ్లే రిపీట్ చేస్తే మురిసిపోయాం. ఇప్పుడు అమ్మాయిల క్రికెట్ లో కూడా ఈ అద్భుతం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్-చండీగఢ్ జట్ల మధ్య కడపలో జరుగుతున్న పేటీఎం అండర్-19 మహిళల క్రికెట్ మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదైంది. చండీగఢ్ కెప్టెన్ కశ్వీ గౌతమ్ తానొక్కతే ప్రత్యర్థి జట్టులోని మొత్తం బ్యాట్స్ ఉమెన్ ను పెవిలియన్ కు పంపి రికార్డు సాధించింది. మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు, అమ్మడు బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. కశ్వీ గౌతమ్ 49 పరుగులతో రాణించింది. ఆ తర్వాత బౌలింగ్ లోనూ విజృంభించి కేవలం 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి 10 వికెట్లు తీసింది. దాంతో అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిలు మరీ దయనీయంగా 8.5 ఓవర్లలో 25 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ జట్టులో మొత్తం 8 మంది అమ్మాయిలు డకౌట్ అయ్యారు.
Kashvee Gautam
Chandigarh
Arunachal Pradesh
Under-19
Cricket

More Telugu News