Pawan Kalyan: నూజివీడు జనసేన నేత భాస్కరరావు మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

Bhaskararaos untimely death is painful says Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
నూజివీడు మున్సిపల్ మాజీ ఛైర్మన్, జనసేన నేత బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు అకాల మరణం ఎంతో విచారకరమని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నూజివీడు ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. నూజివీడు ప్రాంతంలో జనసేనను బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషిని ఎన్నడూ మరువలేమని చెప్పారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం భాస్కరరావు మరణించారనే వార్త విన్న వెంటనే ఎంతో బాధ అనిపించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. సౌమ్యశీలి, మృదు స్వభావుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కరరావుకు తన తరపున, జనసైనికుల తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Basava Vaikuntha Venkata Bhaskar Rao
Death
Condolence

More Telugu News