nagababu: ఈ పిలుపు ఎవరిది? ఎవరికోసం? విజేతలకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్: ఆసక్తికర వీడియోలు పోస్ట్ చేసిన నాగబాబు

nagababu shares few videos satires on jagan
  • 'ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌..' పాట పోస్ట్  
  • 'చవటాయను నేను వట్టి చవటాయను నేను' అనే వీడియోను కూడా 
  • ఎందుకో ఈ పాటలు గుర్తు కొచ్చాయన్న నాగబాబు  
  • నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
'ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌..' పాట వీడియోను పోస్ట్ చేస్తూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఈ పిలుపు ఎవరిది? ఎవరికోసం? విజేతలకు సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబడును' అని ఆయన పేర్కొన్నారు.

'చవటాయను నేను వట్టి చవటాయను నేను' అనే పాట వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'ఎలక్షన్లలో రూ.లక్ష ఖర్చుతో ఎమ్మెల్యేనైపోయాను.. ఆ తర్వాత రూ.10 లక్షలు సంపాదించాను' అంటూ రాజకీయ వ్యంగ్యరూపకంగా ఈ పాట సాగుతుంది. ఎందుకో ఈ పాటలు గుర్తు కొచ్చాయంటూ నాగబాబు పేర్కొన్నారు.  

దీనిపై నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. 'వైసీపీ ,టీడీపీ పార్టీ లో కేస్ లు ఉన్న నాయకులు అనుకుంటున్నాం అండీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'ఇంకెవరు మన జగ్లక్ గారే పిలిచింది, జగ్లక్ బాబా 151 దొంగలని' అని మరొకరు కామెంట్ చేశారు. 
nagababu
Janasena
Viral Videos

More Telugu News