బోయపాటి సినిమాలో కొత్త హీరోయిన్లు?
- బోయపాటి సినిమాకి సన్నాహాలు
- సీనియర్ హీరోయిన్ల డేట్లు దొరకని పరిస్థితి
- కొత్త నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ముందుగా నయనతారను సంప్రదించారు. డేట్స్ ఖాళీ లేవనే సమాధానం నయనతార నుంచి వచ్చిందట. దాంతో శ్రియను సంప్రదించారు. ఆమె అంతగా ఆసక్తిని చూపలేదట. ఇలా సీనియర్ హీరోయిన్స్ అందుబాటులో లేకపోవడం గురించి బాలకృష్ణతో బోయపాటి మాట్లాడటంతో అసహనానికి లోనైన బాలకృష్ణ, కొత్త వాళ్లను తీసుకోమని కాస్త గట్టిగానే చెప్పారట.
సాధారణంగా కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలో బాలకృష్ణ ఆలస్యాన్ని ఎంతమాత్రం సహించరు. అలాంటి ఆయన హీరోయిన్స్ విషయంలో వెతుకులాట కారణంగా షూటింగుకి వెళ్లడం లేట్ కావడాన్ని అసలే ఇష్టపడరు. అందువల్లనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకుని వుంటారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.