చంద్రబాబు గారి హిస్టరీ ఏంటి? అంటూ అంబటి సెటైర్లు

Ambati Rambabu ironies on chandrababu
మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడుల విషయమై ప్రస్తావిస్తూ చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, తన దగ్గర పని చేసే పీఎస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆధారాలు దొరికాయంటే అందులో తన ప్రమేయం ఉన్నట్టు కచ్చితంగా అనుమానం వస్తుందని, అది కామన్ సెన్స్ పాయింట్ అని అన్నారు.

‘చంద్రబాబునాయుడుగారి హిస్టరీ ఏంటి? గత చరిత్ర ఏంటి? ఆయన డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి. లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కాదా? దాంతోనే రాజకీయాలు నడపాలనుకుంటున్న వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. మాజీ పీఎస్ పై ఐటీ దాడులతో చంద్రబాబు దొరికిపోయారని, బాబును కాపాడటం కోసం ఎల్లోమీడియా  ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడే విషయం కాదని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News