Pawan Kalyan: రైతులు ఇచ్చిన మొక్కజొన్న కండెలను సంతోషంగా స్వీకరించిన పవన్

Amaravathi farmers gifts Pawan Kalyan corn
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పర్యటన ప్రారంభించిన పవన్ రాజధాని గ్రామాలకు వెళ్లి అక్కడి రైతులు, మహిళలతో మాట్లాడారు. తాజాగా, రాయపూడి గ్రామాన్ని సందర్శించారు. పవన్ రాక గురించి ముందే సమాచారం ఉండడంతో రైతులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారిలో కొందరు పవన్ కు మొక్కజొన్న కండెలను అందించగా, ఆయన సంతోషంగా స్వీకరించారు. అనంతరం వారి సమస్యలు విన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను జనసేన వర్గాలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Amaravati
Rayapudi
Farmers
Corn

More Telugu News