అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లతో దాడి
- ఇరాక్ లోని కే1 స్థావరంపై నిన్న రాత్రి రాకెట్లతో దాడి
- డిసెంబర్ 27న ఇదే స్థావరంపై 30 రాకెట్లతో దాడి
- అమెరికా, ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా హతం చేసిన తర్వాత... ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో, ఇరాన్ కు చెందిన పలు ఉగ్ర సంస్థలు అమెరికా స్థావరాలపై దాడులకు దిగుతున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.