కొరటాల మూవీలో చెర్రీ జోడీగా సమంత
- 'రంగస్థలం'తో అలరించిన చరణ్ - సమంత
- మరోసారి ఈ జోడీని సెట్ చేసిన కొరటాల
- ఆగస్టులో విడుదల చేసే అవకాశం
చరణ్ జోడీగా సమంతను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందువల్లనే చరణ్ సరసన సమంతను కొరటాల ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో ఆమె జాయిన్ కానుందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.