పూజా హెగ్డే ఆగ్రహం.. కూల్ చేసిన ఎయిర్ టెల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూజా హెగ్డే ఆగ్రహం.. కూల్ చేసిన ఎయిర్ టెల్!

 pooja hegde fires on Airtel
  • సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదు
  • పదే పదే సమస్య వస్తోంది 
  • ఇతర టెలీకాం సిమ్‌ వాడి సమయాన్ని సేవ్ చేసుకోండి
'ఎయిర్‌టెల్‌ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి' అంటూ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆ కంపెనీపై ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని తెలిపింది.

ఎయిర్‌టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్‌ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు చెప్పింది. దీంతో భయపడిపోయిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు ఆమెకు ఫోన్ చేశారు. పూజా హెగ్డేకు ఎదురవుతోన్న తమ సర్వీసు సమస్యలన్నీ పరిష్కరించారు.

'హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం' అని ఎయిర్‌టెల్ ఇండియా తెలిపింది. దీంతో పూజా హెగ్డే కూల్ అయింది.
Pooja Hegde
Twitter
airtel

More Telugu News