అల్లు అర్జున్‌ సినిమా పాటకి ఇంట్లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అదిరిపోయే డ్యాన్స్‌.. 'కెవ్వు కేక' అంటోన్న అభిమానులు
Add ap7am to your home Screen

అల్లు అర్జున్‌ సినిమా పాటకి ఇంట్లో బాలీవుడ్‌ హీరోయిన్‌ అదిరిపోయే డ్యాన్స్‌.. 'కెవ్వు కేక' అంటోన్న అభిమానులు

  • ‘అల..వైకుంఠపురంలో’ సినిమాలోని పుట్టబొమ్మ పాటకు డ్యాన్స్
  • శిల్పా శెట్టి వేస్తోన్న స్టెప్పులకు అభిమానులు ఫిదా 
  • వైరల్ అవుతోన్న వీడియో
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తనదైన శైలిలో తెలుగు పాటకు వేసిన డ్యాన్స్‌ అదుర్స్ అనిపిస్తోంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల..వైకుంఠపురంలో’ సినిమాలోని పుట్టబొమ్మ పాటకు ఆమె తన ఇంట్లో డ్యాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె వేస్తోన్న స్టెప్పులకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు 'కెవ్వుకేక' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన  ‘అల..వైకుంఠపురంలో’ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని అన్ని పాటలు అభిమానులను అలరించాయి. పుట్ట బొమ్మ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. థమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించగా.. పుట్టబొమ్మ పాటను అర్మాన్‌ మాలిక్‌ పాడారు.  

Tollywood
Bollywood
Allu Arjun
Ala Vaikunthapuramulo

More Telugu News