నేనే అల్లు అరవింద్ కొడుకుని అయ్యుంటే అంత కష్టపడేవాడ్ని కాదేమో!: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
- చిరంజీవి తర్వాత అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమన్న శివాజీ
- రజనీకాంత్ స్థాయికి ఎదిగే సత్తా బన్నీకి మాత్రమే ఉందని వెల్లడి
- సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని వ్యాఖ్యలు
'సరైనోడు' సినిమాలో అల్లు అర్జున్ చేసిన క్యారెక్టర్ తనకు ఇష్టమైనదని, ఆ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదని వెల్లడించారు. సినిమా కోసం బన్నీ పడే కష్టం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని, తానే గనుక అల్లు అరవింద్ కొడుకును అయ్యుంటే అంతగా కష్టపడేవాడ్ని కాదేమోనని శివాజీ అభిప్రాయపడ్డారు.