Nara Lokesh: బాదుడే బాదుడు..జగన్ దెబ్బకి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు!: నారా లోకేశ్
నాడు ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ అధినేత జగన్ వాడిన పదం ‘బాదుడే బాదుడు’. అదే పదాన్ని జగన్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రంగా తీసుకుని నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఆయన, ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ధరలు కూడా పెంచారని మండిపడ్డారు. ఫైబర్ గ్రిడ్ బిల్లు నెలకు రూ.235 నుంచి రూ.300కి పెంచేసిందని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. త్వరలోనే విద్యుత్ ధరలు కూడా పెంచుతారంటూ అనుమానం వ్యక్తం చేశారు. జగన్ దెబ్బకు ప్రజలు బతకలేక ఇతర రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి వస్తుందని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.